ప్రజాశక్తి-నందిగామ : యువత స్వయం ఉపాధిపై ఎదగాలి అని నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. నందిగామ రైతు పేటలో ప్రకంపన పత్రిక జర్నలిస్ట్ విశ్వేశ్వరరావు నూతనంగా కొనుగోలు చేసిన అశోక లైలాండ్ టిప్పర్ ను నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. నందిగామ ఈ సందర్భంగా డాక్టర్.మొండితోక జగన్మోహనరావు జర్నలిస్ట్ విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో మంచిగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










