ఈ నేలా ఈ ఆకాశం
యుద్ధాలని ఓడించాయి
అశోకునికి అహింసను
బోధించాయి
దాష్ఠీకానికి
ఎదురుగా నిలబడే
గున్నమ్మల్లకు నిర్మలక్కలకు
జన్మనిచ్చినవి
నాగావళీ వంశధారల పరుగులతో
కరువును ఓడించినవి
ఆదివాసీ విల్లంబులతో
రాజ్యాన్నే నిలువరించిన
మహేంద్ర గిరులివి
తడ భూములను కొల్లగొట్ట వచ్చిన
ధర్మల్ రాకాసులను
వడిసెల రాయితో పారదోలినవి
నెత్తుటి త్యాగాలతో భూదేవి నుదుట
తిలకంగా మెరుస్తున్నవి
కళింగ సీమ ఇది
అమాయకంగా కనిపించే
ధిక్కార భూస్వరమిది!
- కెక్యూబ్
94934 36277










