ప్రజాశక్తి-గణపవరం : గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించాలని కౌలు రైతుల సంఘం మండల కార్యదర్శి పి నరసింహమూర్తి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం కేశవరంలో సంఘం ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో యువతీ యువకులకు వాలీబాల్ కబడ్డీ కుండ కుట్టడం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసింహమూర్తి మాట్లాడుతూ పండగ రోజుల్లో యువతీ యువకులు చెడు వ్యసనాలను కాకుండా ఆటల ఫోటోలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆటలు పోటీల్లో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి నాగేశ్వరరావు పెచ్చిటి హన్సిక పెచ్చెట్టి లక్ష్మీ వీరవల్లి గంగారత్నం బొక్క శ్రీను గుబ్బల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు










