
- ఖగోళ పరిశోధనలకు ఊతం
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో గురుత్వాకర్షణ తరంగాల తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రూ.2600కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో లేజర్ ఇంటర్‌ఫెరో మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (ఎల్‌ఐజిఓ) గా పిలిచే డిటెక్టర్ వుంటుంది. అమెరికాలో ఇప్పటికే అమల్లో వును జంట ఎల్‌ఐజిఎ డిటెక్టర్ల తరహాలోనే దీనిు కూడా మహారాష్ట్రలో నిర్మించనున్నారు. 2016లో గురుత్వాకర్షణ తరంగాలను ఈ డిటెక్టర్లు కనుగొనడం ఖగోళ శాస్త్రంలో కొత్త శకానిు ఆవిష్కరించింది. ఆకాశంలో గురుత్వాకర్షణ తరంగాల మూలాలను గుర్తించే డిటెక్టర్ల సమిష్టి సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకుగానూ ఎల్‌ఐజిఓ-భారత్ సహకారంలో భాగంగా భారత్‌లో మూడో డిటెక్టర్‌ను ఏర్పాటు చేస్తునాురు. తాజాగా దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో రెండు అవకాశాలు లభించాయి. మొదటిది, గురుత్వాకర్షణ భౌతిక శాస్త్ర పరిశోధనకుభారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారడం, రెండోది, సైన్స్‌తో భారత సమాజానికి గల సంబంధాలను తెలివిగా లెక్కించడానికి గల సామర్ధ్యానిు ఎల్‌ఐజిఓ-భారత్ ప్రదర్శించగలుగుతుంది.