Aug 10,2022 20:47

హైదరాబాద్‌ :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో గ్రాన్యూల్స్‌ ఇండియా 6 శాతం వృద్థితో రూ.128 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ ఔషద ఉత్పత్తుల కంపెనీ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.120 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే కాలంలో రూ.850 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ1లో 20 శాతం పెరిగి రూ.1,020 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో అమెరికాలో ఐదు ఔషదాల అనుమతి కోసం దరఖాస్తు చేశామని వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.400 చొప్పున చెల్లించి.. మొత్తంగా 62.50 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేయడానికి కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. పలు బౌగోళిక సమస్యలు నెలకొనడంతో ముడి సరుకుల ధరలు పెరగడం, సాల్వెంట్ల లభ్యతలో సమస్యలు నెలకొన్నప్పటికీ సమర్థవంతంగా రాణించగలిగామని గ్రాన్యూల్స్‌ సిఎండి డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ చిగురుపాటి పేర్కొన్నారు.