
ప్రజాశక్తి-మాడుగుల : పేదలంటే అంత నీర్లక్షం ఎందుకని సిపిఎం జిల్లా కార్యదర్శి కె,లోకనాధం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఆదివారం వి మాడుగుల మండలం వమ్మలి ప్రాంతంలోని ఉర్లలోవ కొండ రెవెన్యూ పరిధిలోని ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న జిల్లాకార్య వర్గసభ్యులు కె గోవిందరావుతో కలిసి పరీశీలించారు. అనంతరం ఈప్రాంతంలో 2013 సంవత్సరంలో వమ్మలి గ్రామంలో మంజూరు చేసిన పట్టాదార్లుతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంవరాలు తరబడి జీడి తోటలు వేసుకొని వాటిపై ఆధార పడిజీవిస్తున్న పేదలను పాలకులు మోసం చేసారని మంఢిపడ్డారు. పట్టాలు పాస్ బుక్కులు ఇచ్చి పది ఎళ్ళు అవుతున్న ఇప్పటి వరకు సర్వే నెంబర్లు సరిచేసి ఆన్లైన్ చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు.
వమ్మలి గ్రామంలో 150 మంది దళితులు ఇతర పేదలకు ఉర్లలోవ రెవిన్యూ పరిధిలో 2013 లో సంవత్సరంలో ఐదు ఆరు విడతల్లో 200 ఎకరాలకు వరకు డి,పట్టాలు పంపిణీ చేశారని. 2014 వెబ్ ల్యాండ్ రికార్డు నమోదు అయిన తర్వాత ఉర్లోవ రెవెన్యూ విలేజ్ మ్యాప్ ఉందని కాని సెటిల్మెంట్ రికార్డ్ లేదన్నారు. దీంతో వెబ్లాండ్ రికార్డులో ఈ రెవెన్యూ విలేజ్ నమోదు కాలేదన్నారు. దీంతో అన్ సెటిల్ విలేజ్ గా ఉండిపోయిందని దీనితో పట్టాలు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందన్నారు. గత 70 సంవత్సరాల నుంచి జీడి మామిడి తోటలపై ఆధారపడుతున్నటువంటి పేదలు ధలిత రైతులుకు. ప్రభుత్వం వ్యవసాయానికి అనే సౌకర్యాలు కల్పిస్తుందని. ప్రభుత్వ యెక్క సంక్షేమ పథకాలు అందాలంటే వెబ్ లాండ్ లో ఈ రెవిన్యూ విలేజ్ నమోదు అయ్యి ఉండాలని తెలిపారు. కానీ పట్టాలు ఉన్నా గాని వెబ్లాంట్ రికార్డులో నమోదు కావకపోడం వల్ల డి పట్టాలు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయని తెలిపారు. ఇదే ధనవంతులకు జరిగితే పాలకులు చూస్తూ ఊరుకుంటారా! అని ప్రశ్నించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్వయాన విచారణ చేసి డి పట్టా సాగుదారు లందరినీ వెబ్లాంట్ రికార్డులు సెటిల్మెంట్ చేసి రికార్డులో నమోదు చేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీ భూమి మా హామీ, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న. ఉర్లవ రెవెన్యూ అన్ సెటిల్డ్ విలేజ్ అవ్వడంతో సాగుదార్లుకు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని తెలిపారు.
అభివృద్ధి పేరు చేప్పి మైనింగ్ కంపెనీలకు లీజులిస్తున్నారని లీజులిస్తున్న ఏరియాలో పేదలు జీడి తోటలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మైనింగ్ కంపినీలు ధళితులను పేదలను అన్యాయంగా నెట్టివేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ఉర్లలోవకొండ చుట్టూ పేదలకు ఇచ్చిన పట్టాలు సర్వే నెంబర్లు సరి చేసి వెంటనే ఆన్లైన్ చేయాలని సాగులో ఉన్నవారి అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో వి,మాడుగుల మండలం సిపిఎం నాయకులు కె భవాని పెదలు ధళితులు పాల్గొన్నారు.