Mar 08,2023 21:21

వాషింగ్టన్‌ : ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఈ ఏడాది ఉద్యోగుల పదోన్నతులను తగ్గించాలని భావిస్తోందని సమాచారం. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ ప్రమోషన్లను తక్కువ మందికి ఇవ్వాలని భావిస్తోందని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్‌ చేసింది. గతంతో పోల్చితే ఈ ఏడాది కొద్ది మందికి మాత్రమే పదోన్నతలు కల్పించనుందని తెలిపింది. అది కూడా మధ్యస్థ స్థాయిలోని ఎల్‌ 6, ఆపై స్థాయిలోనే పదోన్నతులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్‌ చేసుకోవచ్చని గూగుల్‌ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో సూచించినట్లు సమాచారం.