గోడలు మాట్లాడుతున్న వేళ
రోడ్లు జనంతో కదలబారేవి
అడవి పాటల పల్లవయ్యేది
నదులు ఉప్పొంగి ప్రవహించేవి
సముద్రం ఆకాశాన్ని అవనికి చేర్చేది
గోడలు మూగబోయిన వేళ
దారులు మూసుకుపోయాయి
ప్రశ్నలు జైళ్లలో బంధించబడ్డాయి
నదుల జాడలు చెరిగిపోతున్నాయి
అడవి ఒంటరి ఆకాశమయింది
మరల గోడలు మాటాడాలి
నెత్తురంటిన వాక్యం నినాదమై
రాయబడాలి!
- కెక్యూబ్
94934 36277










