Feb 27,2023 16:59
  • తండ్రి అరెస్టు, కొడుకు పరార్ 
  • 60 సీసాలు స్వాధీనం

ప్రజాశక్తి-చీరాల : గోవా నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న స్థావరాలపై సోమవారం సెబ్  అధికారులు దాడులు నిర్వహించారు. చీరాల ప్రాంతానికి చెందిన తండ్రి కొడుకులు ఈ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సెబ్ అధికారులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. సెబ్ అధికారులు మాట్లాడుతూ మద్యం విక్రయాలకు తండ్రి మొగిలి సుబ్బారావు కొడుకు మొగిలి రామారావులు చికెన్ షాప్ వ్యాపారం నిర్వహిస్తూ గోవా నుండి మద్యం తీసుకువచ్చి చీరాల ప్రాంతంలో విక్రయాలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసిన తమ సిబ్బంది సోదాలు నిర్వహించగా రూ 40 వేలు విలువ గల 60 గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాం అన్నారు. తండ్రి సుబ్బారావును అదుపులోకి తీసుకొని అరెస్టు చేయగా కొడుకు రామారావు పరారయ్యాడని వివరాలు వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం అందితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.