May 08,2023 22:54

న్యూఢిల్లీ : ఆర్థిక ఇబ్బందులతో దివాలా తీసిన గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ తక్షణమే టికెట్ల బుకింగ్స్‌ను నిలిపివేయాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి టికెట్లు విక్రయించకూడదని సోమవారం నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే మే 12వ తేది వరకు విమాన సేవలను నిలిపివేసినట్లు ఇటీవల గో ఫస్ట్‌ తెలిపింది. కాగా.. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు టికెట్లను అమ్మకూడదని తాజాగా డిజిసిఎ పేర్కొంది. కార్యకలాపాలను సమర్థంగా నడపడంలో విఫలం అయినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని మరో నోటీసులో కోరింది.