Feb 09,2023 09:33
  • 14 నుంచి 24 వరకు నిర్వహణ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వచ్చే నెలలో విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో భాగంగా కొన్ని ముందస్తు రోడ్‌షోలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఈ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. దీనికోసం రెండు బృందాలను నియమించనున్నారు. మొత్తం ఆరు ప్రధాన నగరాల్లో ఈ రోడ్‌షోలు ఉంటాయి. 14వ తేదీన బెంగళూరులో తొలి రోడ్‌షో ఉంటుంది. 17న చెన్నై, అహ్మదాబాద్‌లో, 21న ముంబయిలో, 22న కోల్‌కతాలో, 24న హైదరాబాద్‌లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించే సదస్సులో పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడులను ఆకర్షిరచేరదుకు ఈ రోడ్‌షోలు ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతోపాటు, విధాన నిర్ణయాల్లో నిష్ణాతులు, ఇతర రంగాల్లో ప్రసిద్ధి చెందిన వారిని కూడా ఈ సదస్సుకు ఆహ్వానించనున్నారు. ఈ సదస్సు కోసం బిజినెస్‌ టు బిజినెస్‌, బిజినెస్‌ టు గవర్నమెరట్‌ సమావేశాలు, కీలకాంశాలపై ప్రసంగాలు, రంగాల వారీ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ అంశాలనే రోడ్‌షోల్లో అధికారులు వివరించనున్నారు.