- ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ.
- ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం
ప్రజాశక్తి-బుట్టాయగూడెం : బోయ వాల్మీకిలను గిరిజన జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం మండల కేంద్రంలోని బస్ షెల్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. "గిరిజనులకు అన్యాయం చేసే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలనీ, బోయి, వాల్మీకులను ఎస్ టీ జాబితాలో చేర్చరాదంటూ, రాష్ట్ర ప్రభుత్వo గిరిజన వ్యతిరేక విధానాలు నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయారు.గిరిజన సంఘం మండల అధ్యక్షులు కారం భాస్కర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ7గురు ఎమ్మెల్యేలను ఒక ఎంపీ స్థానాలు గెలిపించి బ్రహ్మరధం పట్టిన గిరిజనుల పట్ల వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి గౌరవం లేదని గిరిజన వ్యతిరేక విధానాలు అమలు చేయడం బాధాకరమని అన్నారు. గిరిజన తెగలను అభివృద్ధి చేయాల్చిన ప్రభుత్వం"మూలిగే నక్కపై తాటి పండు పడేసినట్లు" అభివృద్ధి చెందిన బోయి వాల్మీకిలను కలపడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి గిరిజనలకు తీరని అన్యాయం చేసారన్నారు. రాయలసీమలోని 40 లక్షలు జనాభా కల్గిన బోయ వాల్మీకి లు నాన్ షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తు(బీసీ ఏ)ల జాబితాలో ఉన్న వారికీ ఎటువంటి ప్రత్యేక భాషా, ఆచారాలు, సాంప్రదాయలు లేవని మిగత అభివృద్ధి చెందిన కులాల వారితో విద్య, వైద్య, ఉపాధిలో ముందు ఉన్నారని తెలిపారు. డాక్టర్ బి ఎన్ లోకూరు కమిషన్ ప్రకారం బోయ వాల్మీకిలకు గిరిజన జాబితాలో చేర్చేందుకు ఎటువంటి అర్హత లేదని అయన స్పష్టం చేశారు. బోయి వాల్మీకీలను ఎస్ టీ జాబితాలో చేర్చరాదని గిరిజన ఆదివాసీ ప్రజాసంఘాల వినతులు స్వికరించిన ఏకసభ్య కమిషన్ జవాబుదారీ లేకుండా ఏకపక్షంగా ఎలా నిర్మాణం చేశారని ప్రశ్నించారు. ఏకసభ్య కమిషన్ శ్యామూల్ ఆనంద్ కుమార్ వారి నివేదికను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బోయి వాల్మీకిలకు అనుకూలంగా చేసిన తీర్మానం ప్రభుత్వం ఉపసంహారించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తామ ముత్యాలమ్మ, మొడియం నాగమణి,మడకం గంగరాజు, ఆదివాసీ కొండరెడ్ల సంఘం జిల్లా అధ్యక్షులు పట్ల రమేష్ కుమార్ రెడ్డి,సరియం దుర్గ, జయలక్ష్మి, భువనేశ్వరి పాల్గొన్నారు.










