ప్రజాశక్తి-నిజాంపట్నం : 10th టైటాన్స్1988-89 పూర్వ విద్యార్థులు ప్రయోజకులైన తర్వాత ఒక వేదికన అందరు కలుసుకోవడం ఒక అపురూప దృశ్యం. స్కూల్ రోజులు పూర్టైన పిదప అందరు మళ్ళీ ఒక చోట కలుసుకోవడం చాలా అరుదు. వీరికి 33 సం.లు పట్టింది. ప్రతి మనిషి జీవితంలో బాల్యం అనేది మరువలేనిది. అది ఒక తీపి గుర్తు. పాఠశాల దశలో చేసిన అల్లరి, చిల్లరి పనులు, తోటివారిని ఏడిపించడం, మాస్టర్ చేతిలో దెబ్బలు తినడం, చివాట్లు పడటం, ఇదంతా చెబితే పెద్ద గ్రంధమే. స్నేహితులందరు ఒక వేదికగా కలుసుకోవడం అనే ఆలోచన చాలా అభినందనీయం. ఆత్మీయ నేస్తాలు కలసిన రోజు పెద్ద పండుగ వాతావరణమే నెలకొంది. నిజాంపట్నం 10th టైటాన్స్1988-89 బ్యాచ్ ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకుంటూ తమ 33 ఏళ్ళు ప్రస్థానం చిన్న నాటి మిత్రుల ఆలింగనాలు, కరచాలనాలు, స్నేహితులకు పెట్టుకున్న నిక్ నేమ్స్ తో మళ్ళీ వాళ్ళని పిలువడం, కల్మషం లేని మనసుతో మాట్లాడుకోవడం, అందరితో పంచుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో సముద్ర తీరం ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేసింది. ఆనాడు కలసి తిరిగిన ప్రదేశాలు, ఆడిన ఆటలు, ఆటస్థలాలు, బెంచ్ మేట్స్ తో ఎంతో చనువుగా ముచ్చటిస్తూ, ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, తమ ప్రాణ స్నేహితులతో సముద్ర తీరంలో ఆనందకరమైన వాతావరణంలో ఆడారు, పాడారు, ఆనందించారు, సందడి చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగిన చిన్ననాటి మిత్రుల ముందు ఎదుగుదల సూన్యం. ఎక్కువ, తక్కువ తారతమ్యాలు కనపడవు. ఒకరి కొకరు తోడుగా వున్న సందేశమే పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం. అపూర్వం మన కలయిక, అద్వితీయం మన స్నేహం అనే స్నేహితులు నినాదాలతో, సముద్రపు ఘోషకు తోడై తీరాన్ని హోరెత్తించారు. సమ్మేళనంలో ప్రసాదం వాసుదేవ, నర్రా నాగేశ్వరరావు, మోపిదేవి నాగరాజు, సరళ కుమార్, నీలా బాలకోటేశ్వరరావు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, శ్రీరామమూర్తి, అబ్దుల్ సలీం 1 & 2, కాళేపల్లి శ్రీనివాసరావు, జిడుగు రాజా, కొత్తగుండు శ్రీధర్, గీతావాణి, నాళం పద్మజ, గ్రంధి భవాని, మల్లీశ్వరి, బెల్లంకొండ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.










