బెర్లిన్ : జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయాన్ని ఆదివారం మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఓ దుండగుడు కారుతో విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. కారుని ఓ విమానం కింద పార్క్ చేసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 2గంటల సమయంలో దుండగుడు కారుతో సెక్యూరిటీ గేట్‌లను ఢీ కొట్టి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అనంతరం గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. వాహనంలో నుండి సిసాలకు నిప్పంటించి బయటకు విసిరినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కారులోని వ్యక్తితోచర్చలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 27 విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రకటించారు.