Jan 07,2021 15:21

న్యూఢిల్లీ : ముంబయి పేలుళ్లలో నిందితుడు గ్యాంగ్‌ స్టర్‌ అబు సలీం పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2005లో పోర్చుగల్‌ నుండి తనను భారత్‌కు రప్పించడం అక్రమమని, భారత అధికారులు నిబంధనలను ఉల్లంఘించినందున ఆ ఆదేశాలను రద్దు చేయాలంటూ ఆ పిటిషన్‌లో అబూసలేం పేర్కొన్నారు. న్యాయవాదితో చర్చించేందుకు, కొన్ని పత్రాలు పొందేందుకు వీలుగా తనను మహారాష్ట్రలోని తలోజా జైలు నుండి ఢిల్లీలోని తీహార్‌ జైలుకు బదిలీ చేయాల్సిందిగా సలీం కోరారు. ముంబయి హైకోర్టుకు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే ఆదేశించారు. ఆర్టికల్‌ 32 కింద ఈ పిటిషన్‌ను ఎందుకు పరిగణిచంచాలని ప్రశ్నించింది. 1993లో ముంబయిలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 700మందికి పైగా గాయపడ్డారు. దీంతో అబూసలీంకు జీవితఖైదు విధించబడింది.