Nov 29,2020 13:38

గుంటూరు: బుల్లితెర నటి, కార్తీకదీపం ఫేమ్‌ వంటలక్క (దీప విశ్వనాథ్‌) గుంటూరు నగరంలో సందడి చేశారు. లక్ష్మీపురం ఒకటో లైనులో మహిళామణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిజోరాషోరూంని ఆదివారం ఆమె అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, మొహమ్మద్‌ ముస్తఫా, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, వైసిపి నగర అధ్యక్షులు పాదర్తి రమేష్‌ గాంధీ, కార్పొరేట్‌ అభ్యర్థి బండ్లమూడి రోజారాణి, తదితరులు పాల్గొన్నారు.