Oct 07,2023 07:50
  • స్పృహ తప్పిన నలుగురు మహిళలు

ప్రజాశక్తి- భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లెలోని ఆర్‌విఆర్‌ రొయ్యల ఫ్యాక్టరీ పక్కనే ఉన్న ఐస్‌ ఫ్యాక్టరీలో శుక్రవారం అమోనియం గ్యాస్‌ లీకైంది. దీంతో, ఆర్‌విఆర్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురు మహిళలు అస్వస్థతకు స్పృహ తప్పి పడిపోయారు. వారిని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదమూ లేదని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.