శింగరాయకొండ (ప్రకాశం) : గ్యాస్ లీకయ్యి హోటల్ దగ్ధమైన ఘటన మంగళవారం శింగరాయకొండ మండలంలో జరిగింది. శింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామంలో రాజారావు ఇంటి దగ్గర చిన్న హౌటల్ ను నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఉదయం హోటల్‌లో గ్యాస్ లీకవ్వడంతో మంటలు వ్యాపించాయి. హోటల్‌తోపాటు ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఇంటిలో బట్టల వ్యాపారం కూడా చేస్తూ ఉండటంతో ఆ బట్టలన్నీ దగ్ధమయ్యాయి. టంగుటూరు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పూర్తిగా హోటల్, ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో సుమారు 7 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.










