- తూర్పుపాలెం గెయిల్ లో గ్యాస్ పైర్
ప్రజాశక్తి-రాజోలు : మలికిపురం మండలం కేశనపల్లి - తూర్పుపాలెం గెయిల్ జిసిఎస్ నందు శుక్రవారం గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ లో రోజువారి కార్యకలాపాలు జరుగుతుండగా ఈ పైర్ అయ్యినట్లు గెయిల్ సిబ్బంది తెలిపారు. జిసిఎస్ ప్లాంట్ లోనే ప్రమాదం జరగడంతో గ్రామస్థులు భయాందోళన గురైనారు.గెయిల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే గెయిల్ నిపుణులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అరికట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. మలికిపురం మండలం కేసనపల్లి గ్రామంలోని ఒ ఎన్ జి సి సైట్ వద్ద గ్యాస్ బావిలో సంభవించిన మంటలను సత్వరం ఆర్పి వేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మల్కిపురం మండలం కేసనపల్లి గ్రామంలోని ఒ ఎన్ జి సి సైట్లో మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు సంభవించిన అగ్నిప్రమాదంలో వెంటనే ఫైర్ అలారం మోగించడంతోపాటు స్థానికులను అప్రమత్తం చేసే విధంగా చేయడం జరిగిందన్నారు. వెను వెంటనే ఫైర్ వాటర్ పంపింగ్ చేయడంతో మంటలను 15 నిమిషాల్లో ఆర్పడం జరిగిందన్నారు. మంటలు వలన పొగలు వచ్చాయని వీటిని చల్లపరచడంతో ద్వారా అదుపులోని తీసుకుని వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 1:50 నిమిషాలకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎలాంటి భయాందోళనలు చెందన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆ ప్రకటనలో తెలిపారు.










