లెస్బోస్ ఐస్‌లాండ్ : గ్రీస్‌లో లెస్బోస్ ద్వీపంలో ఉన్న అతిపెద్ద శరణార్థుల శిబిరం మంటల్లో దగ్ధమయింది. దీంతో వేలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంతో లెస్బోస్ ద్వీపం సంక్షోభంలో చిక్కుకుపోవడమే కాకుండా, సహాయం కోసం ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తోంది. మారియా క్యాంప్ వద్ద పరీక్షల్లో 35 మందికి కరోనా నిర్థారణ అయిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం ప్రారంభయింది. రక్షణ కోసం శరణార్థులు సమీపంలోని ఆలీవ్ తోటల్లోకి పరుగుతీశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరూ మరణించినట్లు, తీవ్రగాయలైనట్లు వార్తలు రాలేదు.వైరస్ పరీక్షలకు 'విధ్వంస ప్రతిచర్య'గానే ఈ ఘటన జరిగిందని గ్రీక్ ప్రధాని మిత్సోటకిస్ ఆరోపిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచడంపై ఆగ్రహాంతోనే శరణార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ప్రాధమిక నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ప్రమాదంపై ఈయు చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 400 యువకులను వారి స్వంత దేశానికి పంపడానికి సహాయం చేస్తామని ఈయు హామీ ఇచ్చింది. శరణార్థులకు సహాయం చేయాలని యూరప్ దేశాలకు జర్మనీ విజ్ఞప్తి చేసింది.
మోరియా శిబిరాన్న మూసేయండి
గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్
గ్రీస్‌లోని మోరియా శరణార్థి శిబిరాన్ని మూసివేయాలని గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) డిమాండ్ చేసింది. ఈ శిబిరంలో 13వేల మంది శరణార్థులు అంటే పరిమితికి మించి నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది.










