Oct 02,2023 13:49

ప్రజాశక్తి-బాపట్ల : డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ 154వ జన్మదిన వేడుకలను అంతర్జాతీయ అహింసా దినముగా ఘనంగా నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉత్తేజ భరితముగా పాల్గొన్నారు.  కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు గాంధీ పటానికి పూలమాలల వేశారు. ఇంచార్జ్ అసోసియేటె దీన్ రవిబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ గొప్ప నాయకులని ఎన్నో ఉద్యమాలలో ఆయన చేసిన కృషి మనం ఈరోజు స్వాతంత్రముగా ఉంటున్నాము అలాంటి వారి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ఎస్ ఏ డాక్టర్ ఆర్ గణేష్ బాబు మరియు విద్యార్థులు గాంధీ గారి గొప్పతనాన్నిఅతను దేశానికి చేసిన త్యాగాలను కొనియాడారు. ఆర్ గణేష్ బాబు మాట్లాడుతూ స్వచ్ఛందంగా దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకొని అహింసా మార్గంలో  మరియు సమానత్వాన్ని చాటుతామని  ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కేవీఎస్ రామిరెడ్డి,  ఎం మాధవ  డాక్టర్ బి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ బి హరిబాబు, డాక్టర్ లావణ్య, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర  సిబ్బంది పాల్గొన్నారు.