Nov 02,2022 12:10

ప్రజాశక్తి-నందిగామ : పట్టణంలోని 10వ వార్డులో గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ-ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పలు సంక్షేమ పథకాలతో పాటు .. ప్రజా ప్రయోజనాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు., రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ -అందరి సంక్షేమం ,అభ్యున్నతికై వైయస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సచివాలయ-వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు , ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా -లేదా ? ,ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ , ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేలా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్, ఏఈ, కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్చార్జులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు