ప్రజాశక్తి-గణపవరం : గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నాలుగు సచివాలయాల్లో ఫ్రైడే డ్రై డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి సంతోష్ నాయుడు, పి కిరణ్మయి మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రతగా ఉంచుకోవాలని అన్నారు. మురికి నీరు నిలువ లేకుండా చూసుకోవాలని అన్నారు. మురికి నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరుగుతాయని అన్నారు. దోమకాటు వలన డేంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, వంటి రోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రామంలో ప్రైడెడ్రైడే నిర్వహించి ప్రజలకు. పరిశుభ్రత పై అవగాహన కలిగిస్తున్నట్లు.చెప్పారు. ఈకార్యక్రమంలో. సిఎచ్చ్.ఒ.జి.విల్సన్ బాబు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు, పంచాయతీ సిబ్బంది, సచివాలయాలు సిబ్బంది పాల్గొన్నారు.










