Mar 24,2023 15:54

ప్రజాశక్తి-గణపవరం : దోమల కొట్టకుండా ప్రతి ఒక్కరు దోమతెరలు వాడాలని కాశిపాడు ఆరోగ్య సహాయకులు నామాల రాజు అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే సందర్భంగా తాళ్లపాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఇంటి పరిసరాల పరిశుభ్రత లేకపోవడంతో దోమలు చేరుతాయని అన్నారు దోమలు కుట్టడంవలన డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా ఫైలేరియా వంటి వ్యాధులు వస్తాయని చెప్పారు ఇంట్లో ఉన్న ఫ్రిజ్జు వెనకబాగంలో ఉన్న నీటిని ప్రతీరోజూ శుబ్రం చేయకపోతే దోమలు చేరుతాయని అన్నారు. దోమలు ఇంటిలోని కిరాకుండా గుమ్మాలకు. కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేసుకోవాలని. చెప్పారు. ర్యాలీలో పరిశబ్రతపై స్తానికులకు పరిశుభ్రతపై అవగహన కల్పించారు. ఈకార్యక్రమంలో ఎంఎల్. ఎచ్చ్.పి.గోపినాద్, ఆషాలు బాగ్యం, జయమ్మ,వలంటీర్లు పాల్గోన్నారు