Aug 06,2023 16:48

న్యూఢిల్లీ   :  కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం ఆదివారం విరుచుకుపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ముకాశ్మీర్‌లో శాంతి నెలకొందన్న ప్రభుత్వ వాదనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. భారతదేశమంతటా స్వేచ్ఛ అణచివేయబడిందని, ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో అది అత్యంత తీవ్రంగా అణచివేయబడిందని మండిపడ్డారు. జమ్ముకాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నప్పుడు.. మెహబూబా ముఫ్తీపై ఎందుకు గృహ నిర్బంధం విధించారని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల కార్యాలయాలను ఎందుకు సీల్‌ వేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా '' 'సమాధి యొక్క శాంతి, బానిసల మౌనం'కి వ్యతిరేకంగా హెచ్చరించిన అధ్యక్షుడు జాన్‌ కెన్నెడీని నేను కోట్‌ చేయాలనుకుంటున్నాను'' అని ట్వీట్‌ చేశారు.