Aug 13,2023 13:30

స్వాతంత్రము వచ్చే
జన తంత్రమే తెచ్చే
ఆంగ్ల ప్రభుత తొలగే
భారత పాలన నిలిచే

భాషలు వేరైనా
భావము ఒక్కటే
జాతులు వేరైనా
జీవనం ఒక్కటే !

మతములు వేరైనా
దేవుడు ఒక్కడే
సమరసము పలికి
గొంతెత్తి చాటెదము

ఎత్తైన కొండలు
లోతైన నదులు
పండే పంటలు
మనవే వనరులు

మువ్వన్నె పతాకము
ఎగురవేసి మనము
జేజేలు పలుకెదము
మన కీర్తి చాటెదము!

- బెహరా ఉమామహేశ్వరరావు,
92900 61336.