ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలో శనివారం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ సిటి పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు, ఎంఎల్సి మొండితోక అరుణ్ కుమార్, ఎసిపి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అభ్యర్ధులు పట్టుదలతో కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాదించాలని కోరారు.ఆర్డిఓ రవీంధ్రరావు, ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










