May 22,2023 16:38

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : వైద్య రంగంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారు నేడు మన ఇంకొల్లు మండలం గంగవరం  గ్రామంలో సొసైటీ బిల్డింగ్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం నందు ఉచితంగా మందుల పంపిణీ మరియు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి గుండె, కిడ్నీ, విష జ్వరాలు లాంటి వ్యాధులకు వైద్యులు, పేషంట్లకు తగు జాగ్రత్తలు చెప్పారు. రోగ నిర్ధారణ జరిగిన 50 మంది పేషంట్లకు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ, ఈహెచ్ఎస్, కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని.కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ  తెలిపారు. ఈ క్యాంపు నందు డాక్టర్ రామాంజనేయులు ఆప్తమాలజిస్ట్, రాణి కిమ్స్ హాస్పిటల్స్ సిబ్బంది, మొదలగు వారు పాల్గొన్నారు. 200మందికి పైగా చికిత్స పొందారు.