ప్రజాశక్తి-మండపేట : స్థానిక గొల్లపుంత కాలనీలోని టిడ్కో గృహ సముదాయం వద్ద కాలనీ వాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న చేతిపంపులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజాబాబులు కాలనీ వాసులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధులు రూ.30 లక్షల రూపాయలతో 110 చేతుపంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలనీ ప్రజల నీటి సౌకర్యార్థంతో పాటు ఇతర అవసరాలకు గాను ప్లాట్ పామ్ కూడా నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ విప్ పోతంశెట్టి వరప్రసాద్, కౌన్సిలర్లు కొవ్వాడ బేబీ అప్పన్నబాబు, శెట్టి కళ్యాణి, వైసీపీ పట్టణ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు, ఎంసీ డైరెక్టర్లు కొప్పిరెడ్డి పద్మావతి, షేక్ మస్తాన్, జంగం కార్పొరేషన్ డైరెక్టర్ మెగాడు శ్రీను కార్పొరేషన్ డైరెక్టర్ అలీ ఖాన్ బాబా, మున్సిపల్ కమిషనర్ టి. రామ్ కుమార్, ఏఈ సత్యనారాయణ, వైసిపి నాయకులు సాధనాల శివ భగవాన్, 20 వార్డు కార్యకర్తలు, నాయకులు
తదితరులు పాల్గొన్నారు.










