Oct 06,2023 16:54
  • రీసర్వేను పకడ్బందీగా నిర్వహించండి
  •    జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు

ప్రజాశక్తి-యదమరి(చిత్తూరు) : ప్రజా వినతుల పరిష్కారంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ పి. శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం యాదమరి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్య క్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించి దరఖాస్తుదారునికి సంతృప్తి కరమైన సేవలుఅందించాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రజా సేవ చేయడం అదృష్టంగా భావించాలని, జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను 15 రోజుల లోపు చట్ట పరిధిని అనుసరించి పరిష్కరించాలని, పరిష్కరించడానికి అవకాశం లేకపోతే అందుకు గల కారణాలను దరఖాస్తు పై వివరంగా రాసి ఉంచాలని, 15 రోజుల తరువాత ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అర్జీల పరిష్కారంలో క్రింది స్థాయి సిబ్బంది అధికారులకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. మండల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి, పిఓఎల్ఆర్ ను సక్రమంగా నిర్వహించి, పకడ్బందీగా రీసర్వే చేపట్టాలని, గ్రామాలలో టాం టాం లు వేయించి మ్యూటేషన్ ల అర్జీలను స్వీకరించాలని, అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూముల ను  అనధికారికంగా వినియోగిస్తున్న వివరాలను సేకరించాలని, నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని, అసైన్మెంట్ కమీటీ ద్వారా వాటిని పరిశీలించి అర్హులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.