- 100శాతం ఫలితాలకు కృషి
- పక్కా ప్రణాళికతో పరీక్షల నిర్వహణ
- ప్రతి ఒక్కరిపై దృష్టి
ప్రజాశక్తి-రేపల్లె: పదోతరగతి పాసైతే సైకిల్ కొనిస్తా, ఎక్కువ మార్కులొస్తే టూర్‌కు తీసుకెళ్తానంటూ తల్లిదండ్రులకు విద్యార్థులకు హామీలు ఇస్తున్నారు. మరోవైపు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు రూపొందించుకొంటున్నారు. ఎలాగైనా మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే పనిలో విద్యార్థులు నిమగమయ్యారు. రేపల్లె మండలంలో 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాలలు, ఒక ప్రభుత్వ పాఠశాలతో పాటు 16 ప్రయివేటు పాఠశాలల నుంచి ఈ ఏడాది 1269 మంది పదో తరగతి విద్యార్థులు పరిక్షలు రాయనున్నారు. ఉదయం పూట పరీక్షలు, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులతో ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధంచేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ప్రణాళికలను ఆయా పాఠశాలల్లో అమలు చేస్తూ ముందుకేళుతున్నారు. చదువుల్లో వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
- ఇలా రాస్తే మంచి మార్కులు
విద్యార్థులు పరిక్ష రాసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్సర్‌షీట్ పై భాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో ఖాళీగా వదిలిపెట్టాలి. పేజి కుడిపైపు కూడా ఒక అంగుళం వదిలిపెట్టి రాయాలి. ఇలా ఉంటే మూల్యాంకనం సమయంలో ఉపాధ్యాయుడికి జవాబు స్పష్టంగా కనపడడం వల్ల అధిక మార్కులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జవాబులో ముఖ్య పదాలు ఉంటే వాటి కింద నల్లని పెన్సిల్‌తో గీత గీయాలని సూచిస్తున్నారు.
- రేపల్లె మండల విద్యాశాఖ అధికారి టి.నవీన్ కుమార్










