ప్రజాశక్తి-విఆర్ పురం : ఒక పక్క నైరుతి రుతుపవనాలు మరోపక్క అల్ప పీడన, వాయు గుండాలతో గోదావరీ నదీ పరీవాహక ప్రాం తాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరి నది ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటిన వరద తగ్గుముఖం పట్టినట్టే పట్టి భారీ వర్షాలతో తిరిగి నీటి మట్టం పెరుగుతొంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 42.5 అడుగులుగా ఉన్న ప్రవాహం క్రమేపీ పెరుగుతూనే ఉంది. గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిండుతున్న జలాశయాలుండి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక రెండో హెచ్చరిక కూడా జారీ చేశారు. మూడో హెచ్చరిక సాయంత్రం లోగా ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే వరద 50.90 అడుగులకు ఉంది తగ్గకుండా రావచ్చని భావిస్తున్నారు. ఏమైనా వరద ఉదృతిపై బుధవారం రాత్రికి ఒక అంచనా రావచ్చని తెలుస్తోంది. ఇలావుంటే గోదారమ్మ తమ ఉరకలతో దోబూచులాడుతుండటంతో అల్లూరి జిల్లాలోని విలీన పోలవరం ముంపు మండలాల ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. వడిగూడెం. అడివి వెంకన్నగూడెం. రామవరం సోంపల్లి సుష్టివారిగూడెం చింతరేగుపల్లి గుర్రంపేట గుర్రంపేట విఆర్ పురం గ్రామాల చుట్టూ చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీరామగిరి కొల్లూరు కోటార్గుమ్ము ఇప్పుడు ములకలపల్లి జల దర్భములో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగం ప్రజలను ఖాళీ చేపించి పునరవాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత ఏడాదిలా ఉగ్రరూపం దాల్చకు తల్లీ అంటూ గోదారమ్మని వేడుకుంటున్నారు. కాగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంటున్నప్పటికీ ఆ అంశంలో ఎంతవరకూ సఫలీకృతు లౌతారో చూడాల్సివుంది. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తరలించిన గ్రామాల ప్రజలకు తారువలలో ఐదు లీటర్ల కిరోసిన్ పాల ప్యాకెట్లు నిత్యవసర సరుకులు తక్షణమే అందించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










