- భద్రాచలం వద్ద కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక
- కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలం వద్ద 50.50 అడుగుల నీటిమట్టం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : తగ్గినట్టే తగ్గిన గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఆందోలన చెందుతున్నారు. గురువారం ఉదయం భద్రాచలం వద్ద 50.50 అడుగుల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 12.50 అడుగులు నామోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసారు. కాటన్ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పైకి లేపి 10,97,144క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంట కాలువలకు 4000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వరద నీటి ప్రవాహం పెరగడంతో లంకల ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వాయుగుండ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గోదావరి తీర ప్రాంతవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు.











