Sep 03,2023 16:05

తెలంగాణ : తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, నల్గండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్‌ ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.