Sep 14,2023 12:34

హైదరాబాద్‌ : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నేటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాబోయే మూడు రోజుల పాటు, మిగిలిన జిల్లాలకు శనివారం రోజుకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజులలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.