Sep 13,2023 14:25

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉన్న అవర్తన ప్రభావం వలన బుధవారం ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.