Jul 30,2023 19:41

ప్రజాశక్తి - యానాం : యానాం గౌతమీ గోదావరి వరద నీటితో ఉరకలెత్తుతోంది. వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేయడానికి ఆదివారం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి సంబంధిత అధికారులతో కలిసి స్థానిక రాజీవ్ బీచ్, ఫెర్రీ రోడ్డును పరిశీలించారు. అదేవిధంగా పుష్కరఘాట్, యానాం-ఎదుర్లంక వారధి జీసస్ స్టాట్యూ వద్ద నీటి మట్టాన్ని చూశారు. రాజీవ్ పార్క్, భారత్ మాత, జీసస్ స్టాట్యూ వద్దకు వరద నీరు ప్రవేశించడంతో బీచ్ సందర్శకులకు రాకపోకలు నిలిపివేశారు. పలుచోట్ల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. కనకాలపేట లంక భూముల్లోకి వరద నీరు చేరింది. ధవలేశ్వరం బ్యారేజ్ నుండి అధిక నీటిని విడుదల చేయడంతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.