
ప్రజాశక్తి - పెనుమంట్ర(పశ్చిమగోదావరి) : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం పొలమూరు అంబేద్కర్ కాలనీలో తాటకిల్లు దగ్ధం కావడంతో రెండు కుటుంబాల చెందిన నలుగురు నిరాశయులైనారు. వివరాలకు వెళ్తే కూలి పని చేసుకుంటూ జీవించే ఇంజే ఇజ్రాయిల్, ఇంజే నాగేశ్వరరావు తన భార్య ప్రేమకుమారి, ఇద్దరు చిన్నారులు ఒకే తాటాకిల్లులో రెండు పోర్షన్లుగా నివాసం ఉంటున్నారు. ఆదివారం యధావిధిగా ఇంట్లో వాళ్ళు ఉదయం 9 గంటల సమయంలో చర్చికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పైకప్పు నుండి మంటలు చెలరేగాయి. విషయం గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంటిలో ఉన్న సామాన్లు కాలిపోయాయి. ఈ సందర్భంగా స్థానికులు అత్తిలి ఫైర్ స్టేషన్ , విఆర్‌ఓ కు అధికారులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికి అత్తిలి ఫైట్ కానిస్టేబుల్ నాగేశ్వరావు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులైనటువంటి ఇజ్రాయిల్ , నాగేశ్వరరావు వద్ద నష్టం గురించి తెలుసుకొని నమోదు చేసుకున్నారు.