- వరద సాయం జిఓ విడుదల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంభవించిన గోదావరి వరదల్లో పూరిగుడిసెలు, పాకలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకుఈ మేరకు శనివారం జిఓ ఆర్‌టి నెంబరు 42ని విడుదల చేసింది. గతంలో ఎస్‌డిఆర్‌ఎఫ్ నిబంధనల కింద రూ. 5వేలు ఆర్దిక సహాయం అందిస్తుండగా ఈనెల 28న సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్దిక సహాయాన్ని పెంచిన విషయం తెలిసిందే. వరద బాధితులకు తక్షణ సహాయం కింద ఉచితంగా ఒక్కో ఇంటికి 25కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామాయిల్ ఒక లీటర్, ఉల్లి గడ్డలు ఒక కిలో, బంగాళాదుంపలు కిలో ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శనివారం జీఓ ఆర్‌టి నెంబరు 41ని విడుదల చేసింది.










