May 31,2023 17:27
  • పెద్దసంఖ్యలో హజరైన మహిళలు, పురప్రముఖులు

ప్రజాశక్తి-వేటపాలెం : స్థానికంగా ప్రసిద్ది చెందిన శ్రీచెన్నకేశవస్వామి దేవస్థానంలో బుధవారం శిలాధ్వజస్థంభం ప్రతిష్ఠాపన కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 8గంటలకే వైభవంగా ప్రత్యేక పూజకార్యక్రమాలు ప్రారంభించారు. ఎనిమిదిన్నర గంటలకల్లా ప్రజలందరి గోవిందనామం, జైచెన్నకేశవ ఉచ్చరణతో గోవిం దా గోవిందా అంటూ వేదమంత్రాల మధ్య బారీ ప్రొక్లెయన్ సహాయంతో శిలాధ్వజస్థంబాన్ని ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపనకు కర్తలు ఎన్నారై కోడూరి కిరణకుమార్ ధర్మపత్ని రాధామాధవి దంపతులు సోమవారం దీక్షా స్వీకర ణ,అంకురార్పణ,నీరాజన కార్యక్రమాలు చేశారు. మంగళవారం విష్వక్సేనప రాజ,పుణ్యాహవవాచన,అంగహెూమము,మూలమంత్ర హవనము, నవగ్రహ ఆరాధన మహెూశాంతి హెూమం నిర్వహించారు. ఈసందర్భంగా చీరాల వైసిపి ఇన్ఛార్జీ కరణం వెంకటేష్ బాబును ఆలయ మర్యాదగా మంగళ వాయిద్యాలతో స్వామి దర్శనానికి తోడ్కోని వెళ్ళారు. ఈసందర్భంగా వెంకటేష్ బాబు ప్రత్యే పూజకైంకర్యాలు నిర్వహించారు. వైసిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు ఎమ్మల్సీ పోతుల సునీతకు దుశ్శాలువాతో ఎన్నారై కిరణ కుమార్ సత్క రించి ఒడిబియ్యాన్ని అందించారు. ప్రతిష్ట అనంతరం దాదాపు ఏడు వేల మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈకార్యక్రమంలో దేవాదాయ ధర్మ దాయశాఖ బాపట్ల జిల్లా ఎసి యం. పానకాలరావు, స్థానిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జివిఎల్.కుమార్,కార్యక్రమ నిర్వహణ పూజారులు నారాయణం అ నంత పద్మానాభచార్యులు, శ్రీనివాసుల హనుమాచార్యులు, యాజ్ఞకులు ము త్తేవి శశికాంత్ ఆచార్యులు, పురప్రముఖులు ప్రత్తి వెంకట సుబ్బారావు, ప్రత్తి ముత్తుకుమరన్,కరణం మురళీ, వల్లంపట్ల మురళీకృష్ణ పాల్గోన్నారు.