
ఇంకొల్లురూరల్(ప్రకాశం): ఎయిడ్స్ నివారణపై ఇడుపులపాడు విద్యాపరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిడపర్తి పేరిరెడ్డి అధ్యక్షత వహించారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై వైద్యఆరోగ్య శాఖ ఎఎన్‌ఎం నాగరాజు కుమారి అవగాహన కల్పించారు. పాఠశాల సిబ్బంది పర్వతనేని పావని, భవనం శివలీల, పెంట్యాల పావని, బండారు అనిల్ కుమార్, అంబటి సురేష్, వసంత రఘుబాబు, పెండ్యాల రాధిక, గోబిదేశి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.