ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం : మండలంలోని ప్రియదర్శిని కళాశాలలో ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29 రాష్ట్ర మహాసభల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను ఏర్పాటు చేశారు. బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్, ఏ వి ఆర్ విజ్ఞాన కేంద్రం, ఎస్ ఎఫ్ ఐ సంయుక్త ఆద్వర్యంలో పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించారు. స్థానిక ప్రముఖ న్యాయవాది మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు మేక ఈశ్వరయ్య ప్రారంభించారు.










