Jun 06,2023 15:23

ముంబయి  :    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం ఉదయం ప్రారంభ ట్రేడ్‌లో భారీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ 72.61 పాయింట్లు క్షీణించి రూ. 62,714 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 12.15 పాయింట్లు కోల్పోయి రూ.18,581 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌, కోటక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతి, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల బాట పట్టాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హిందూస్థాన్‌ యూనీలివర్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారం అనంతరం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను పెంచనున్నందున్న వార్తలతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో సూచీలు తడబడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విదేశీ నిధుల ప్రవాహం, అమెరికా ఈక్విటీల్లో బలహీనతల ప్రభావం స్టాక్‌ మార్కెట్‌ సూచీలపై పడినట్లు తెలిపారు.