మాజీమంత్రి ఆనందబాబు
ప్రజాశక్తి - భట్టిప్రోలు : గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీమంత్రి నక్కా ఆనందబాబు సూచించారు.పంచాయతీ ఎన్నికల పై గురువారం స్థానిక రమా గుప్త కల్యాణ మండపంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలులో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో పోటీకి సిద్ధపడాలని, ఏకగ్రీవాలపై దృష్టి సారించి ప్రలోభాలకు లోనుకాకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయలని కోరారు. కార్యక్రమంలో జీడీసీసీబీ మాజీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










