ప్రజాశక్తి - ఆలమూరు : ఎన్నికల నియమాలలోని నిర్దిష్ట ప్రణాళికలను తప్పక అనుసరించాలని ఎంపీడీవో జేఏ ఝాన్సీ అధికారులను ఆదేశించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో బుధవారం ఏవో టి.వి.సురేంద్ర రెడ్డి, ఈవోపీఆర్డీ రాజ్ కుమార్ లతో కలసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి ఫ్లెక్సీలు ఉంచరాదన్నారు. అలాగే నాయకుల విగ్రహాలకు వెంటనే ముసుగులు తొడగాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి అధికారి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సత్యనారాయణ, సంజీవరెడ్డి, రాజు, వీర్రాజు, సుబ్బారావు, విజయరాజు, శివకుమార్, సత్తిబాబు, రేణుక, వీరమాత, శబరి, మోక్షఅంజలి, మంజరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










