Feb 05,2021 00:56

సబ్‌కలెక్టర్‌కు సమస్యను తెలియజేస్తున్న అభ్యర్థులు

ప్రజాశక్తి-ఈపూరు : మండలంలోని ముప్పాళ్ల, ఇనిమెళ్ల, ఈపూరు నామినేషన్‌ కేంద్రాలను నరసరావుపేట సబ్‌కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌ అజరుకుమార్‌ గురువారం పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను నోటీసు బోర్డులో పెట్టకపోవడంపై మండి పడ్డారు. ఈపూరు నామినేషన్‌ కేంద్రం వద్ద అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేవారు లేకపోవడంపై ఫిర్యాదు అందగా ఎంపిడిఒ ఎస్‌.ప్రసాద్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. అనంతరం అభ్యర్థులతో మాట్లాడిన సబ్‌కలెక్టర్‌ సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్నవారి నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. ఆమెవెంట తహశీల్దార్‌ వి.కోటేశ్వరరావు నాయక్‌, ఎస్‌ఐ సిహెచ్‌ సింగయ్య ఉన్నారు.