న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల అమ్మకాలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయని ఆర్థిక శాఖ శనివారం ప్రకటించారు. నవంబర్ 6 నుండి 20వ తేదీ వరకు 15 రోజులు పాటు బాండ్ల అమ్మకాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నెలరోజుల వ్యవధిలో రెండోసారి ఎన్నికల బాండ్ల అమ్మకాలు నిర్వహించడం గమనార్హం. తాజా నోటిఫికేషన్‌తో .. ఎన్నికల బాండ్లను 2023 అక్టోబర్ నుండి 2024 మే వరకు (సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడే వరకు) 75 రోజుల పాటు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అన్ని అధీకృత బ్రాంచ్‌ల్లోనూ ఈ బాండ్ల అమ్మకాలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్‌లో ఈ పథకాన్ని సవరించింది. 2018 జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఈ విక్రయాలు 29వ విడత. ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.