Dec 08,2020 18:02

పశ్చిమ గోదావరి : ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వింత వ్యాధితో బాధపడుతున్న రోగులను వామపక్ష నేతలు మంగళవారం పరామర్శించారు. బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏలూరు నియోజకవర్గంలోనే ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలను అధికారులు పరిశీలించి నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు. ఏలూరులో ప్రధానంగా పారిశుధ్య లోపం ఉందని, ఆ సమస్యను అధికారులు పరిష్కరించాలన్నారు. రిపోర్టుల అనంతరం సమస్య నివారణ చర్యలను అధికారులు త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ, సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.