
అమరావతి: ఎపి ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు నుండి ఈ సస్పెన్షన్ పొడిగింపు అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో రక్షణ ఉపకరణాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఆయనపై వేటు వేసిన విషయం విధితమే. అలాగే సర్వీసు నిబంధనలనూ అతిక్రమించారనే ఆరోపణలున్నాయి.