బీజింగ్ : తూర్పు చైనాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రాజధాని బీజింగ్‌కు దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ నగరానికి సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి వుంది.